Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

కర్నాటక సిఎంకు ప్రధాని మోడీ ఫిట్‌నెస్ ఛాలెంజ్(వీడియో)

PM Modi has cheeky 'challenge' for Karnataka CM HD Kumaraswamy

న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్’ పేరిట ఫిట్‌నెస్ ఛాలెంజ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు తమ రోజువారి వ్యాయమాలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఇతర సెలబ్రిటీలకు ఛాలెంజ్ విసురుతున్నారు. ఈ క్రమంలో మూడు వారాల క్రితం ప్రధానమంత్రి మోడీకి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నుంచి ఇదే విధమైన సవాలు ఎదురుకాగా, దాన్ని స్వీకరించిన ప్రధాని తాజాగా తన ఫిట్‌నెస్ వీడియోను పోస్ట్ చేశారు. అనంతరం కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి తన ఫిట్ నెస్ చూపాలని సవాల్ విసిరారు. కుమారస్వామితో పాటు కామన్వెల్త్ క్రీడల పతక విజేత మోనికా బాత్రా, 40 ఏళ్ల వయసు దాటిన ఐపిఎస్ అధికారులనూ  కూడా మోడీ ఛాలెంజ్ చేశారు. ఇక తన ఫిట్ నెస్ వీడియోలో పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశంలతో స్ఫూర్తి పొందానని మోడీ పేర్కొన్నారు. వీటికి యోగా తోడైతే మరింత ఆనందంగా జీవితాన్ని గడపవచ్చని ప్రధాని తెలిపారు. ఇప్పుడు ప్రధాని మోడీకి సంబంధించిన ఫిట్ నెస్ వీడియో ట్విట్టర్ లో తెగ హల్ చల్ చేస్తోంది. కాగా, ‘హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్’ పేరుతో ఫిట్ నెస్ ఛాలెంజ్ ప్రచారోద్యమాన్ని కేంద్ర క్రీడలశాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ప్రధాని మోడీ ఛాలెంజ్ పై స్పందించిన సిఎం కుమారస్వామి… ‘మీ ట్వీట్ కు ధన్యవాదాలు. ఫిజికల్ ఫిట్‌నెస్ ప్రాధాన్యత గురించి నాకు బాగా తెలుసు. అందుకే నా డైలీ వర్క్ అవుట్ లో  యోగాతో పాటు ట్రెడ్ మిల్ చేస్తుంటాను. ఇప్పుడు నా ఆందోళన అంతా నా రాష్ట్ర ఫిట్‌నెస్ గురించే, దీనికి మీ సహయం కావాలి’ అని ట్వీట్ చేశారు. 

Comments

comments