Home జాతీయ వార్తలు ఆ విషయంలో ఎంపిలు ఆత్మపరిశీలన చేసుకోవాలి: మోడీ

ఆ విషయంలో ఎంపిలు ఆత్మపరిశీలన చేసుకోవాలి: మోడీ

 

న్యూఢిల్లీ: సోమవారం నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన ఆదివారం అఖిలపక్ష పార్టీల భేటీ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా సాగేందుకు విభేదాలను పక్కనపెట్టి జాతి ప్రగతికి ముందుకు సాగుదామని విపక్ష పార్టీల నేతలకు మోడీ పిలుపునిచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్నామా లేదా అనే విషయాన్ని ఓ సారి ఆత్మపరిశీలన చేసుకోవాలని ఎంపిలకు ప్రధాని సూచించారు. 2022 నాటికి నవభారత నిర్మాణాన్ని సాధించే దిశగా సభ్యులు తమ సలహాలు, సూచనలు అందజేయాలని అన్నారు. రాజకీయ పార్టీలు లేవనెత్తే ప్రతి అంశంపైనా చర్చించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ప్రధాని మోడీ తెలిపారు. ఈ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి, భాజపా రాజ్యసభ పక్షనేత థావర్‌ చంద్‌ గహ్లోత్‌తోపాటు పలువురు విపక్ష పార్టీ నేతలు పాల్గొన్నారు.

PM Modi hold all parties meeting