Search
Wednesday 21 November 2018
  • :
  • :

మోడీ నిఖార్సయిన ప్రజా నాయకుడు: కంగన

Modi Rightful leader of democracy

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. ప్రధాని మోడీ నిఖార్సయిన ప్రజా నాయకుడని ఆమె పేర్కొంది. రానున్న ఎన్నికల్లో మోడీకి మరోసారి భారత ప్రధానిగా అవకాశం ఇవ్వాలని తన అభిప్రాయాన్ని తెలియజేసింది. ప్రజాస్వామ్యానికి మోడీనే సరైన వ్యక్తి ఆమె తెలిపింది. ఆయన జీవితంలోని సంఘటనల ఆధారంగా ‘చలో జీతే హై’ సిన్మా తెరకెక్కిన విషయం తెలిసిందే. శనివారం రాత్రి ముంబయిలో ప్రదర్శించిన ఈ సిన్మా ప్రత్యేక స్ర్కీనింగ్ కు కంగన రనౌత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీ తన జీవితంలో ఎంతో కష్టపడి ఈ స్థాయికి ఎదిగారని ఆయనకు ప్రధాన మంత్రిగా మరోసారి అవకాశం ఇవ్వాలన్నారు. ప్రధాని పదవికి ఆయన అర్హుడైన వ్యక్తి అని ఆమె కితాబిచ్చారు. మోడీ జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితులు, ఆయన బాల్యాన్ని ఈ సిన్మాలో అద్భుతంగా చూపారని కంగన ప్రశంసల వర్షం కురింపించారు. ఈ చిత్రానికి ఆనంద్ ఎల్. రాయ్, మహవీర్ జైన్ లు దర్శకులుగా పనిచేశారు.

Comments

comments