Home జాతీయ వార్తలు బడ్జెట్‌పై మోడీ భేటీలు

బడ్జెట్‌పై మోడీ భేటీలు

Pm-Modi

న్యూఢిల్లీ : రానున్న బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీ కీలక అంశాలపై చర్చించడానికి మంగళవారం ఆర్థిక, ఇతర మంత్రిత్వ శాఖలకు చెందిన అత్యున్నత అధికారులతో కార్యదర్శులతో సమావేశమయ్యారు. ప్రధాని నివాసంలో ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన ఐదుగురు కార్యదర్శులు, నీతి ఆయోగ్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నా రు. ప్రతి విభాగం లోను సంస్కరణలు తీసుకు వచ్చి దేశ ఆర్థిక పరిస్థితిని అభివృద్ధి చేయాలన్న దే మోడీ లక్షం. 201920 బడ్జెట్‌ను జులై 5న ప్రవేశపెట్టాలని షెడ్యూలు నిర్ణయించారు. 201819లో జిడిపి అయిదేళ్ల వెనక్కు 6.8 శాతానికి దిగజారింది. ద్రవ్యోల్బణం ఆర్‌బిఐ సౌలభ్య పరిధిలోనే ఉన్నప్పటికీ జనవరి నుంచి మార్చి వరకు ఆర్థిక స్థితి ఐదేళ్ల వెనక్కు వెళ్లింది.

pm modi meetings on budget 2019