Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

మన శాస్త్రవేత్తల సృజనాత్మకత అపూర్వం: ప్రధాని మోడీ

modi1న్యూఢిల్లీ: పిఎస్‌ఎల్‌వి-సి35 ప్రయోగంపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేశారు. ‘ఇది చాలా అపురూపమైన, గర్వించదగ్గ క్షణం. మన శాస్త్రవేత్తలు ప్రతిసారీ చరిత్రను లిఖిస్తూనే ఉన్నారు. వారి సృజనాత్మకత ప్రపంచవ్యాప్తంగా భారత్ గర్వపడేలా చేస్తోంది’ అని ప్రధాని ట్వీట్ చేశారు. మన దేశానికి చెందిన స్కాట్‌శాట్-1 సహా ఎనిమిది ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి పిఎస్‌ఎల్‌వి-సి35 వాహకనౌకను ఇస్రో ప్రయోగించిన విషయం తెలిసిందే. అయితే ఒకే ప్రయోగంలో విభిన్న కక్ష్యల్లో ఉపగ్రహాలను ప్రవేశపెట్టడం ఇస్రోకు ఇదే తొలిసారి.

Comments

comments