Home జాతీయ వార్తలు కర్నాటక విజయం అసాధారణం: ప్రధాని మోడీ

కర్నాటక విజయం అసాధారణం: ప్రధాని మోడీ

BJP

ఢిల్లీ: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయం అసాధరణమని ప్రధాని నరేంద్ర మోడీ సంతోషం వ్యక్తం చేశారు. మంగళవారం ఢిల్లీ బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ప్రధాని మాట్లాడారు. కర్నాటక ఎన్నికల్లో కార్యకర్తల కఠోర శ్రమ వల్లే విజయం సాధించామని తెలిపారు. కార్యకర్తలందరికి మోడీ ధన్యవాదాలు తెలిపారు. కార్నాటకలో సరైన వ్యూహం వల్లే విజయం సాధ్యమైందని వెల్లడించారు. భాజపాను ఇప్పటి వరకు హిందీ భాష పార్టీ అనేవాళ్లు గుజరాత్, మహారాష్ట్ర, గోవా, అసోం ఇవేవీ హిందీ భాష రాష్ట్రాలు కావుని ప్రధాని సూచించారు. ఇప్పుడు కర్నాటక ఈ అపవాదను తప్పు అని మరోసారి నిరూపించింది. కోన్ని పార్టీలు స్వలాభం కోసం రాష్ట్రాలు, ప్రజల మధ్య భేదభావాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నం చేశారన్నారు. కేంద్ర, రాష్ర్టాల మధ్య గొడవలతో సమాఖ్య విధానానికి నష్టం కలిగించాయని వివరించారు. గతంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు ఆ రాష్ట్ర భాష రాదని ఎగతాళి చేశారని గుర్తు చేశారు. కర్నాటక ప్రజలు ఎలాంటి భేదభావాలు లేకుండా నన్ను ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ దేశంలో మూలమూలనా దేశం కోసం ప్రాణాయి ఇచ్చే ప్రజలు ఉన్నారని తెలిపారు. భాష, జాతి, మతం, కులం అన్నింటినీ అధిగమించి దేశం కోసం పరిశ్రమిస్తున్నారు. ఏ పని మొదలుపెట్టినా 2019 ఎన్నికలతో జోడిస్తున్నారు. ఎన్నికలు వేరు … దేశం వేరు… అనే విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. భాజపా విజయం కోసం పరిశ్రమించిన కార్యకర్తలకు రుణపడి ఉంటమన్నారు. జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన కసరత్తు అనిర్వచనీయన్నారు. అమిత్ షా మేథోపరమైన కసరత్తు కన్నా.. ఊరూరా తిరిగి ప్రచారం చేయటం విశేషమన్నారు. యావత్ భారతదేశం అభివృద్ధి చెందేందుకు బిజిపి కృషి చేస్తుందని  మోడీ పేర్కొన్నారు.