Home జాతీయ వార్తలు కేదార్‌నాథ్‌లో మోడీ ప్రార్థనలు

కేదార్‌నాథ్‌లో మోడీ ప్రార్థనలు

 

కేదార్‌నాథ్: హిమాలయ ప్రాంతంలోని పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ శనివారం ప్రార్థనలు జరిపారు. లోక్‌సభ ఎన్నికలకు తుది విడత ఎన్నికల ప్రచారం ముగిసిన ఒక రోజు తర్వాత ప్రధాని శనివారం ఉదయం జాలీ గ్రాంట్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు శాంతి భద్రతల డిజిపి అశోక్ కుమార్ చెప్పారు. ఆలయంలో ప్రార్థనల తర్వాత మోడీ ఇక్కడ పర్వతంపై ఉన్న ధ్యాన్ కుటియా అనే గుహలో కొంతసేపు ధ్యానంలో గడిపారు. గత రెండేళ్లలో మోడీ ఈ ఆలయానికి రావడం ఇది నాలుగోసారి. ఆదివారం ఆయన బదరీనాథ్ ఆలయానికి వెళ్లి ప్రార్థనలు చేస్తారు. శీతాకాలం విరామం తర్వాత ఈ నెలారంభంలో ఈ ఆలయాల మహా ద్వారాలను తిరిగి తెరిచారు. ప్రధాని ఆలయ దర్శనానికి ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. అయితే ప్రవర్తనా నియమావళి ఇప్పటికీ అమలులో ఉందని ప్రధానమంత్రి కార్యాలయానికి తెలిపింది.

PM Modi special prayers in Kedarnath temple