Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

28 కోట్ల ఎల్‌ఇడి దీపాలను అమర్చాం: మోడీ

Modi

ఢిల్లీ: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కన్వెన్షన్ సెంటర్‌లో అంతర్జాతీయ సౌరశక్తి కూటమి సదస్సు ప్రారంభమైంది. భారత్, ఫ్రాన్స్ దేశాలు సంయుక్తంగా సౌరశక్తి కూటమి సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ…. సౌరవిద్యుత్‌కు మరింత ప్రాచుర్యం కల్పించే అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టాలని సూచించారు. విద్యుత్ ఖర్చు ఆదా దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. సోలార్ ఆధారిత వీధి దీపాలు ఏర్పాటు చేయడం జరిగిందని, 28 కోట్ల ఎల్‌ఇడి బల్బులను అమర్చామని మోడీ చెప్పారు. సౌరశక్తి కూటమి సదస్సులో 23 దేశాల అధినేతలు పాల్గొన్నారు. ఈ సదస్సులో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్, ఆస్ట్రేలియా, యుఎస్‌ఎ, నైగర్, రువాండా, ఫిజి, బంగ్లాదేశ్, శ్రీలంక, సెషెల్స్, ఘనా, మడగాస్కర్, మలావీ, మారిషస్, వెనిజువెలా, గాబన్ తదితర దేశాధినేతలు హాజరయ్యారు.

Comments

comments