Home జాతీయ వార్తలు అద్వానీ ఆశీస్సులు తీసుకున్న మోడీ

అద్వానీ ఆశీస్సులు తీసుకున్న మోడీ

LK Advaniఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ బిజెపి కురువృద్ధుడు ఎల్ కె అద్వానీ, అగ్రనేత మురళీ మనోహర్ జోషిలను కలిసి వారి ఆశీస్సులు తీసుకున్నారు. మోడీ వెంట బిజెపి చీఫ్ అమిత్ షా కూడా ఉన్నారు. ఎన్నికల వేళ మురళీమనోహర్ జోషి మోడీని తీవ్రంగా ఇబ్బంది పెట్టిన విషయం తెలిసిందే. అయినప్పటికీ మోడీ ఆయన్ను కలిసి ఆశీర్వాదం తీసుకోవడం చర్చనీయాంశమైంది.  శుక్రవారం ఉదయం మోడీ, అమిత్ షాలు అద్వానీ ఇంటికి వెళ్లారు. ఈ ఎన్నికల్లో బిజెపి సాధించిన అఖండ విజయాన్ని వారు అద్వానీతో పంచుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై వారు చర్చించారు. అద్వానీతో భేటీ అనంతరం వారు మురళీ మనోహర్ జోషి ఇంటికి వెళ్లి ఆయన ఆశీస్సులు కూడా తీసుకున్నారు.

PM Modi Take Blessings From LK Advani