Home జాతీయ వార్తలు అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు: ప్రధాని మోడీ

అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు: ప్రధాని మోడీ

MODI-21న్యూఢిల్లీ: సెప్టెంబర్ 5న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయుల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు రాజకీయ, సినీ ప్రముఖలు శుభాకాంక్షలు తెలిపారు. ‘దేశ వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులందరికీ నా శుభాకాంక్షలు’ అంటూ ప్రణబ్ ట్వీట్ చేశారు. అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు, దేశ అభ్యున్నతికి పాటుపడుతున్న ఉపాధ్యాయులకు సలాం అని ప్రధాని సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.