Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

మోడీ అమెరికా పర్యటన ఖరారు

  • 26న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో చర్చలు
  • ద్వైపాక్షిక బంధాల బలోపేతంపై దృష్టి

Modi-Trump

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ రెండ్రోజుల అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 25, 26 తేదీల్లో ఆయన యుఎస్‌లో పర్యటిస్తారు. 26న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మోడీ చర్చలు జరుపుతారు. హెచ్1 బి వీసా నిబంధనల్లో మార్పులపై వస్తున్న ఆందోళనలు సహా పలు అంశా లపై ఇరు దేశాల నేతలు చర్చించనున్నారు. ఈ నెల 25న మోడీ అమెరికా పర్యటన మొదలవుతుంది. ఇరు దేశాల నేతల మధ్య ప్రత్యేకించి ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా చర్చలుంటాయని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. మోడీ-ట్రంప్ మధ్య జరగనున్న చర్చలు ఇరు దేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక బంధానికి సరికొత్త దిశను నిర్దేశిస్తాయని  తెలిపింది. ఇరు నేతల మధ్య ఇదే మొట్టమొ దటి అధికారిక సమావేశం. ‘జూన్ 26న ట్రంప్‌తో మోడీ చర్చలు జరుపు తారు. పరస్పర ప్రయోజనాలకు సంబంధించినఅంశాలపై మరింత పటిష్ట మైన ద్వైపాక్షిక బంధానికి, భారత్-అమెరికా దేశాల మధ్య బహుళ పాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతానికి వారి చర్చలు సరికొత్త దిశను నిర్దేశిస్తాయి’అని విదేశాంగ శాఖ వెల్లడించింది. ట్రంప్‌తో చర్చల సందర్భంగా  హెచ్‌చ1బి వీసాల సమస్యను మోడీ లేవనెత్తుతారని గతవారం నిర్వహించిన వార్షిక విలేకరుల సమావేశంలో విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ వెల్లడించిన  సంగతి తెలిసిందే. పాకిస్తాన్ ప్రాయోజిత తీవ్ర వాదం సహా ప్రాంతీయ భద్రతా పరిస్థితితో పాటు ఇతర అంతర్జాతీయ సమ స్యలు కూడా వీరిద్దరి మధ్య చర్చకు రావొచ్చు.

Comments

comments