Home జాతీయ వార్తలు అన్ని రంగాల్లో అభివృద్ధే మా లక్ష్యం: ప్రధాని

అన్ని రంగాల్లో అభివృద్ధే మా లక్ష్యం: ప్రధాని

 

న్యూఢిల్లీ: దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే మా లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్ సభలో మోడీ మాట్లాడుతూ..రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడిన సభ్యులకు ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపారు. ప్రజల సంక్షేమం, సంరక్షణ తదితర అంశాలపై రాష్ట్రపతి ప్రసంగంలో వివరించారన్నారు. రాష్ట్రపతి ప్రసంగం ప్రజల మనోభావాలకు అద్దం పట్టిందని పేర్కొన్నారు. స్పీకర్ ఓంబిర్లా సభను సమర్థవంతంగా నడుపుతున్నారన్నారు. మహనీయుల ఆశయాలకు అనుగుణంగా పాలన అందిస్తామని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.

తమ ఐదేళ్ల పరిపాలనకు నిదర్శనమే 2019 ఎన్నికల ఫలితాలు అని, దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని… ఆ దిశగా ముందుకు సాగుతామని ప్రధాని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, విపక్ష నేతలు విలువైన సలహాలు ఇవ్వాలని కోరారు. అంతా కలిసి దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన అవసరముందని ఈ సందర్భంగా ప్రధాని మోడీ అన్నారు.

PM Modi to thanks of President address in Lok Sabha