Home జాతీయ వార్తలు రేపు గుజరాత్‌లో మోడీ పర్యటన

రేపు గుజరాత్‌లో మోడీ పర్యటన

Pm modi visit to gujarat tomorrow

అహ్మదాబాద్: దేశప్రధాని నరేంద్రమోడీ గురువారం గుజరాత్‌లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా మోడీ గుజరాత్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి హాజరుకానున్నారు. తరువాత వల్సాద్ పట్టణంలో నిర్వహించనున్న సమావేశంలో పాల్గొంటారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ఉద్ధేశించి ప్రధాని మోడీ సభలో మాట్లాడనున్నారు. అనంతరం జునాగఢ్ పట్టణంలోని సౌరాష్ట్రకు వెళ్లి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. గుజరాత్ మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ సొసైటీలో నిర్మించిన హాస్పిటల్, సోమ్‌నాథ్ జిల్లా వెరావల్ పట్టణంలో రెండు ఫిషరీస్ కాలేజీలను  మోడీ ప్రారంభించనున్నారు.