Home జాతీయ వార్తలు కాశీ ప్రజలకు రుణపడి ఉంటా: మోడీ

కాశీ ప్రజలకు రుణపడి ఉంటా: మోడీ

 

లక్నో: వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు. బిజెపి కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. కార్యకర్తల సంతోషమే పార్టీకి బలమని పేర్కొన్నారు. కాశీ ప్రజలకు రుణపడి ఉంటానని తాను స్పష్టం చేశారు. కాశీ విశ్వనాథుని గుడిలో మోడీ పూజలు చేశారు. కార్యకర్తల శ్రమతోనే విజయం సాధ్యమైందన్నారు. పిఎం మోడీ ఈ పార్లమెంట్ ఎన్నికలలో 4.79 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాశీ శక్తిని, శాంతిని ఇస్తుందని కొనియాడారు.  542 లోక్ సభ స్థానాలలో బిజెపి 303 సీట్లు దక్కించుకున్న విషయం తెలిసిందే. కాశీ విశ్వనాథుని దేవాలయంలో మోడీతో పాటు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, యుపి సిఎం యోగి ఆధిత్యానాథ్ పూజలు చేశారు. 

 

PM Modi Visits Varanasi After Massive Win