Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

మాజీ ప్రధాని వాజ్‌పేయిని పరామర్శించిన మోదీ,రాహుల్‌ గాంధీ

PM Modi visits veteran leader Atal Bihari Vajpayee at Delhi

ఢిల్లీ: అల్జీమర్స్‌ అనే వ్యాధితో కొంతకాలంగా బాధపడుతున్న మాజీ ప్రధాని వాజ్‌పేయి ఇవాళ ఉదయం ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు.గత కొంతకాలంగా వాజ్‌పేయి అనారోగ్యంతో బాధపడుతున్నవిషయం తెలిసిందే. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం ఎయిమ్స్ కు తరలించినట్లు బిజెపి ప్రకటించిందది. ఆసుపత్రిలో చేరిన  వాజ్‌పేయిని పలువురు ప్రముఖులు పరామర్శించారు. ఇవాళ సాయంత్రం  ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి జేపీ నడ్డా ,బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రి కి వెళ్లి వాజ్ వాజ్‌పేయీని పరామర్శించారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రిలో చేరిన వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. వాజ్‌పేయికి అందుతోన్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అలాగే, అంతకు ముందు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కూడా వాజ్‌పేయిని పరామర్శించారు. వాజ్‌పేయి ఆరోగ్యం నిలకడగానే ఉందని ఎయిమ్స్‌ సంచాలకుడు డాక్టర్‌ రణదీప్‌ గులేరియా వెల్లడించారు. ఆయనకు అన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అల్జీమర్స్‌  అనే వ్యాధితో కొంతకాలంగా బాధపడుతున్న వాజ్‌పేయి రాజకీయాలకు దూరమై ఇంటికే పరిమితమయ్యారు.

Comments

comments