Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

రాహుల్ కి ప్రధాని మోడీ బర్త్‌డే విషెస్

PM Modi wishes Rahul Gandhi on his 48th birthday

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నేడు 48వ పుట్టిన రోజు జరుపుకుంటున్న రాహుల్ ఆయురోగ్యాలతో  ఉండాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మంగళవారం ఉదయం నుంచి న్యూఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాస ప్రాంతం కాంగ్రెస్ కార్యకర్తలతో నిండిపోయింది. తమ అభిమాన నేతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు భారీ ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చాయి. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పలువురు కాంగ్రెస్ నేతలు ఆయన్ను ప్రత్యక్షంగా కలిసేందుకు ఢిల్లీకి చేరుకున్నారని సమాచారం.

Comments

comments