Search
Wednesday 26 September 2018
  • :
  • :

గిన్నిస్‌లోకి ప్రధాని మోడీ సూటు

Modi's-Suitన్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ ధరించిన సూటు గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. వేలంలో అత్యధిక ధర పలికిన సూటుగా గిన్నిస్‌లో చోటు దక్కించుకుంది. ఈ మేరకు గిన్నిస్ బుక్ నిర్వాహకులు సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ సూటు 4,31,31,311 రూపాయలకు(4.31 కోట్లు) అమ్ముడైనట్లు వెల్లడించింది. కాగా, గుజరాత్ కు చెందిన లాల్జీభాయ్ తులసిబాయ్ పటేల్ 2015, ఫిబ్రవరి 20న వేలంలో దీన్ని దక్కించుకున్నారని తెలిపింది. ’నరేంద్ర దామోదర్‌దాస్ మోడీ’ పేరు కనిపించేలా తయారు చేయడం ఈ సూట్ ప్రత్యేకత. విదేశాల్లో నివసిస్తున్న రమేశ్ విరాణి అనే వ్యాపారవేత్త ఈ సూటును ప్రధానికి బహుమతిగా ఇచ్చారు. దీన్ని తయారు చేయడానికి సుమారు రూ. 11 లక్షలు ఖర్చు చేశారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ పర్యటనకు వచ్చినప్పుడు నరేంద్ర మోదీ ఈ సూటు ధరించారు. ఖరీదైన సూటు ధరించిన మోడీపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

Comments

comments