Search
Friday 16 November 2018
  • :
  • :

ముంద్కా- బహదూర్‌ఘర్‌ గ్రీన్‌ లైన్‌ ప్రారంభం

PM Narendra Modi addressing inauguration ceremony of Mundka-Bahadurgarh section

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని మెట్రోకు చెందిన కొత్త సెక్షన్‌ ముంద్కా- బహదూర్‌ఘర్‌ గ్రీన్‌ లైన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆదివారం ప్రారంభించారు. అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ…  మెట్రో ఇండియా కోచ్‌లను మన దేశంలోనే తయారు చేసుకుంటూ ‘మేక్‌ ఇన్‌ ఇండియా’కు ఊతమిస్తున్నామని పేర్కొన్నారు. ఢిల్లీ మెట్రోతోపాటు దేశంలో ఇతర మెట్రోలకు వివిధ దేశాలు సహకారం అందించిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు మనం ఇతర దేశాలకు కోచ్‌ల డిజైనింగ్‌లో సహాయం చేస్తున్నామని మోడీ అన్నారు. కొత్త సెక్షన్ ప్రారంభం సందర్భంగా ఢిల్లీ, హర్యానా ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు.

Comments

comments