Search
Wednesday 14 November 2018
  • :
  • :

పెట్టుబడిదారులకు భారత్ అనుకూలం: ప్రధాని మోడీ

PM Narendra Modi at meeting of Asian Infrastructure Investment Bank in Mumbai

ముంబయి: దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో జరుగుతున్న ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్(ఎఐఐబి) సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆర్థికాభివృద్ధి స్థిరత్వానికి ఇండియా, ఎఐఐబిలు సంయుక్తంగా కృషి చేస్తున్నాయని ప్రధాని మోడీ అన్నారు. ఇండియాలో పబ్లిక్ ప్రైవేటు పార్టనర్‌షిప్(పిపిపి) విధానాన్ని అమలు చేస్తున్నామని ప్రధాని పేర్కొన్నారు. అలాగే భారత్ పెట్టుబడిదారులకు ఎంతో అనుకూలమైన దేశమన్నారు. వివిధ ప్రాజెక్టుల స్థాపనకు పెట్టుబడులు పెట్టడానిక ఆసక్తి చూపుతన్న పెట్టుబడిదారులు దేశంలో రాజకీయ స్థిరత్వాన్ని, ఆర్థిక స్థిరత్వాన్ని కోరుకుంటున్నారని మోడీ స్పష్టం చేశారు. తమ పెట్టుబడులకు రక్షణ కల్పిస్తూ సహకరించే యంత్రాంగాన్ని పెట్టుబడిదారులు కోరుతున్నారని తెలిపారు.

Comments

comments