Home తాజా వార్తలు పిఎం నరేంద్రమోడీ బయోపిక్‌ ట్రైలర్‌ విడుదల

పిఎం నరేంద్రమోడీ బయోపిక్‌ ట్రైలర్‌ విడుదల

Vivek-oberoi

ముంబయి: బాలీవుడ్ న‌టుడు వివేక్ ఒబేరాయ్ ప్ర‌ధాన పాత్ర‌లో నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ ఒమంగ్ కుమార్ తెర‌కెక్కిస్తున్న చిత్రం పిఎం నరేంద్రమోడీ. భారత ప్రధాని మోడీ జీవితాధారంగా తెరకెక్కిన ‘పిఎం నరేంద్రమోడీ’ బయోపిక్‌ ట్రైలర్‌ విడుదలైంది. ఓ సాధారణ ఛాయ్‌వాలా.. ఈ దేశ ప్రధాని అవుతాడా?’ అన్న డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలైంది. మోడీ బాల్యం, ఆర్‌ఎస్‌ఎస్‌లో ఎలా చేరారు? వంటి సన్నివేశాలను ఆసక్తికరంగా చూపించారు. మోడీ ప్రధాని అయ్యాక పాకిస్థానీయులు భారత్‌పై చేస్తున్న దాడులను చూసి ఓర్వలేక..‘ఇంకోసారి హిందుస్థాన్‌పై చెయ్యివేస్తే.. నరికేస్తా. ఇదే పాకిస్థాన్‌కు నా హెచ్చరిక’ అని ట్రైలర్‌ చివర్లో మోడీ(వివేక్ ఒబేరాయ్) చెబుతున్న డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. పిఎం న‌రేంద్ర‌మోడీ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషలతో కలిపి దాదాపు 23 భాషల్లో విడుదల చేయనున్నారు. ఇందులో భాజపా అధ్యక్షుడు అమిత్‌ షా పాత్రలో సినీ నటుడు మనోజ్‌ జోషి నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఎక్కువ శాతం ఉత్త‌రాఖండ్‌లో జరిగింది. గుజ‌రాత్ సిఎం నుంచి 2014లో లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మోదీ సృష్టించిన ప్ర‌భంజ‌నాన్ని కూడా చిత్రంలో ప్ర‌జెంట్ చేయ‌నున్నారు.. ఏప్రిల్‌ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

PM Narendra Modi biopic trailer Released