Home జాతీయ వార్తలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పండి : మోడీ

కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పండి : మోడీ

PM Narendra Modi Comments on Congress

ఛత్తీస్‌గఢ్ : అర్బన్ నక్సల్స్‌కు మద్ధతిస్తూ ఆదివాసీ జీవితాలను నాశనం చేస్తున్న కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పాలని ప్రధాని నరేంద్రమోడీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ఆదివాసీ సంస్కృతిని హేళన చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సౌభాగ్య ఛత్తీస్‌గఢ్‌ను ఏర్పాటు చేసే వరకు తాను విశ్రమించబోనని మోడీ పేర్కొన్నారు. నక్సల్స్‌ను బూచిగా చూపి బస్తర్ ప్రాంతాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదని ఆయన ధ్వజమెత్తారు. అర్బన్ నక్సల్స్ నగరాల్లో ఉంటూ ఎసి కార్లలో తిరుగుతున్నారని, వారి పిల్లలు విదేశాల్లో చదువుతున్నారని, కానీ నక్సల్స్ ప్రభావిత రాష్ట్రంలో ఆదివాసీ పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారని, ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ అర్బన్ నక్సల్స్‌కు ఎందుకు మద్ధతు ఇస్తుందని ఆయన నిలదీశారు. ఈ విషయమై కాంగ్రెస్‌ను నిలదీయాలని ఆయన ప్రజలను కోరారు.

PM Narendra Modi Comments on Congress