Home జాతీయ వార్తలు జయం మాదే : ప్రధాని మోడీ

జయం మాదే : ప్రధాని మోడీ

PM Modiలక్నో : ఈ లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించి, మళ్లీ తామే అధికారంలోకి వస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు. దేశంలో తమ ప్రభుత్వ అనుకూల పవనాలు వీస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. గురువారం ఆయన వారణాసిలో బిజెపి కార్యకర్తలతో మాట్లాడారు. దేశ ప్రజలకు సుపరిపాలన అందించేందుకు తాము హుందాగా పని చేశామని ఆయన చెప్పారు. బిజెపి విజయానికి అంకితభావంతో పని చేస్తున్న పార్టీ కార్యకర్తల కష్టాన్ని తాను గుర్తించానని ఆయన తెలిపారు. తమ ప్రభుత్వాన్ని గెలిపించేందుకు దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కార్యకర్తల సమావేశం అనంతరం మోడీ కాలబైరవ ఆలయంలో పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. కొద్ది సేపట్లో ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు.

PM Narendra Modi Comments on Loksabha Elections