Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

కరుణానిధి భౌతికకాయానికి మోడీ నివాళి

PM Narendra Modi pays last respects to former CM M Karunanidhi

చెన్నై: తమిళనాడు మాజీ సిఎం, డిఎంకె అధినేత కరుణానిధి భౌతికకాయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాళులర్పించారు. కరుణానిధి పార్థివదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు తెలిపారు. అనంతరం ఎంకె స్టాలిన్, కనిమొళితో పాటు కరుణానిధి కుటుంబ సభ్యులను ప్రధాని మోడీ ఓదార్చారు. ప్రధానితో పాటు  కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కరుణానిధి భౌతికకాయానికి నివాళులర్పించారు. ఢిల్లీ నుంచి చెన్నయ్‌కు ప్రత్యేక విమానంలో వచ్చిన మోడీకి ఆ రాష్ట్ర గవర్నర్ బన్వరీలాల్, సిఎం పళనిస్వామి, డిప్యూటీ సిఎం పన్నీర్ సెల్వం తదితరులు స్వాగతం పలికారు.

Comments

comments