Home ఆంధ్రప్రదేశ్ వార్తలు తెలుగులో మాట్లాడిన మోడీ

తెలుగులో మాట్లాడిన మోడీ

Narendra Modiగుంటూరు : ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం గుంటూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వానికి చెందిన 3 ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మొదటగా ఆయన కొంతసేపు తెలుగులో మాట్లాడారు. ‘‘అక్షర క్రమంలోలే కాకుండా అన్ని రంగాల్లో.. అంశాల్లో అగ్రగాములైన ఆంధ్రప్రజలకు శుభాకాంక్షలు అంటూ ఆయన తెలుగులో మాట్లాడారు. ప్రద్మభూషణ్‌, దళిత రత్నం, కవి కోకిల గుర్రం జాషువా జన్మించిన గుంటూరు జిల్లా ప్రజలకు నమస్కారమంటూ ఆయన పేర్కొన్నారు. అనంతరం ఆయన హిందీలో మాట్లాడారు. మోడీకి ముందు ఎపి బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడారు. ఎపికి కేంద్రం అందించిన వివిధ ప్రాజెక్టులపై ఆయన మాట్లాడారు. ఎపిని కేంద్రం అన్ని విధాల ఆదుకుంటుందని ఆయన తెలిపారు.

PM Narendra Modi Speech in Telugu