Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

చారిత్రక మార్పునకు నీతి ఆయోగ్ వేదిక : మోడీ

PM Narendra Modi Talks about "Team India" in Niti Aayog

2017-18 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో వృద్ధిరేటు 7.7గా ఉందని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. ఈ వృద్ధిరేటును రెండంకెల స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వం ముందు ఉన్న లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ పాలక మండలి నాల్గో సమావేశం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా మోడీ ప్రారంభోపన్యాసం చేశారు. దేశంలో చారిత్రక మార్పునకు నీతి ఆయోగ్ వేదిక అని ఆయన పేర్కొన్నారు. సహకార, పోటీతత్వ సమాఖ్య దేశాన్ని అందించేందుకు ‘ టీమిండియా ’ పాలన అనేది ఓ సంక్లిష్ట సమస్య అని, దీనిపై పాలకమండలి సమీక్ష చేస్తుందని ఆయన తెలిపారు. స్వచ్ఛభారత్ మిషన్, డిజిటల్ లావాదేవీలు, నైపుణ్యాభివృద్ధి వంటి కార్యక్కమాల కోసం కమిటీలను ఏర్పాటు చేశామని, ఆ కమిటీల ద్వారా విధానపరమైన నిర్ణయాల్లో ఆయా రాష్ట్రాల సిఎంలు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. 2022 నాటికి సరికొత్త భారతాన్ని నిర్మించాలని ఆయన చెప్పారు. రాష్ట్రాలకు కేంద్రం అన్ని విధాల సహాయ, సహాకారాలు అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

PM Narendra Modi Talks about “Team India” in Niti Aayog

Comments

comments