Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

వరంగల్ మహిళతో ముచ్చటించిన మోడీ…

modi

న్యూఢిల్లీ : వరంగల్ అర్బన్ జిల్లాలోని వేలేరు మండలానికి చెందిన స్వయం సహాయక సభ్యురాలు కౌసర్ షాహిన్ బేగంకుతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గురువారం మాట్లాడారు. గత కొద్ది కాలంగా వివిధ వర్గాలకు చెందిన ప్రజలతో ‘ప్రధాన మంత్రి జన్‌సంవాద్’ కార్యక్రమం ద్వారా నేరుగా ప్రధాని ప్రజలను పలుకరిస్తున్నసంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ ”ఎన్‌ఆర్‌ఎల్‌ఎ” వర్గానికి చెందిన మహిళలతో మోడీ ముచ్చటించారు. ఈ నేపథ్యంలో ప్రధానితో మాట్లాడే అవకాశం కౌసర్ షాహిన్‌కు దొరికింది. ఈరోజు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కౌసర్ ప్రధానితో మాట్లాడారు. దేశంలోని పలు రాష్ర్టాల్లోని మహిళలకు పొదుపు పాఠాలు కౌసర్ చెప్పారు. అంతేకాకుండా ఎంతో మంది మహిళలకు ఆమె శిక్షణ ఇచ్చారు. ఆ శిక్షణ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆమెకు ప్రఖ్యాతిని తెచ్చిపెట్టింది. ప్రధాని మోడీతో ముచ్చటించడం తన అదృష్టంగా భావిస్తున్నానని కౌసర్ పేర్కొన్నారు.

Comments

comments