Home తాజా వార్తలు మస్కట్‌ శివాలయంలో ప్రధాని మోడీ పూజలు

మస్కట్‌ శివాలయంలో ప్రధాని మోడీ పూజలు

PM-Narendra-Modi-prays-at-S

మస్కట్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అరబ్ దేశాల పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా సోమవారం ప్రధాని మోడీ మస్కట్‌లోని మత్రా ప్రాంతంలోగల 125 ఏళ్ల క్రితంనాటి పురాతన శివాలయంలో పూజలు నిర్వహించారు. గుజరాత్‌కు చెందిన వ్యాపార వర్గాలు 125 ఏళ్ల కిందట ఈ శివాలయాన్ని నిర్మించగా 1999లో పునరుద్ధరించారట.ఈ ప్రాంగణంలో శ్రీ ఆది మోతీశ్వర్ మహదేవ్, శ్రీ మోతీశ్వర్ మహదేవ్, శ్రీ హనుమాన్ దేవాలయాలున్నాయి. పవిత్ర దినాల్లో ఈ దేవాలయాన్ని దాదాపు 15,000కు పైగా భక్తులు సందర్శిస్తుంటారని సమాచారం. ఈ సందర్భంగా మస్కట్ శివాలయంలో పూజలు చేయడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.