Home తాజా వార్తలు తెలంగాణ, ఎపిలకు అవార్డుల పంట

తెలంగాణ, ఎపిలకు అవార్డుల పంట

National-Panchayati-Raj--Da

న్యూఢిల్లీ: జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పంచాయతీరాజ్‌ల అభివృద్ధిలో ఈ ఏడాది తెలుగు రాష్ట్రాలకు మొత్తం 20 అవార్డులు దక్కాయి. వీటిలో ఎపికి 12అవార్డులు వస్తే.. తెలంగాణకు 8అవార్డులు దక్కించుకుంది.  లక్నోలో సోమవారం జరిగే కార్యక్రమంలో ప్రధాని మోడీ అవార్డులను ప్రదానం చేయనున్నారు.

మౌలిక వసతులు, తాగునీరు, పారిశుద్యం తదితర అంశాలను పరిశీలించి దేశంలోని 25రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. ఈ అవార్డుల కింద ఉత్తమ జిల్లా పరిషత్‌కు రూ.50లక్షలు, మండల పరిషత్‌కు రూ.25లక్షలు, గ్రామ పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన 8 నుంచి 10లక్షల నగదు అందజేస్తారు.