ఇది స్టార్టప్‌ల ప్రభంజనం కొనసాగుతున్న సమయం. మిగతా వ్యాపారాలతో పాటు డిజిటలైజేషన్, ఇంకా బైమోడల్ ఐటి పరిశ్రమ, ఈ రెండు వ్యాపారాలకి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆఫీస్(పిఎమ్ఒ) మద్దతు తప్పక అవసరమవుతుంది. పిఎమ్ఒ అంటే బిజినెస్, ఏజన్సీ లేదా ఎంటర్‌ప్రైజ్‌తో కూడి ఉన్న ఒక విభాగం. సంస్థలోనే, దాని ప్రమాణాలకు తగ్గట్టు నడుస్తుంది. పిఎమ్ఒలో సర్దుబాట్లు చేయలేకపోవడం, విఫలమవడం వలన సంస్థ తన లక్షాలను చేరుకోవడం కష్టమవుతుంది. దాంతో సమయానికి డెలివర్ చేయాల్సిన ప్రాజెక్ట్‌లు ఆగిపోతాయి. అందుకే పిఎమ్ఒ లీడర్లు అమలు చేయాల్సిన ఉత్తమ సాధనలను గురించి గార్ట్నర్ అనే వ్యక్తి ఇలా చెప్తున్నాడు.
సీనియర్ మేనేజర్లకు సమాచారం అందించడం
సీనియర్ మేనేజర్లు అడిగిన సమాచారం ఇవ్వడంలో ఎప్పుడూ పిఎమ్ఒలు విఫలమవుతుంటాయి. దానివలన అంచనాలకు, వాస్తవానికి మధ్య సంబంధం తెగిపోయినట్టవుతుంది. ఎంత వివరంగా చెప్తే అంత బాగా చెప్పినట్టు అనే పాత నమ్మకం నుంచి పిఎమ్ఒలు బయటకు వచ్చి లీడర్‌కి అవసరమైన, వారి బాధ్యతకు మద్దతునిచ్చే విధంగా రిపోర్టింగ్ ఉండాలి.
ఏ సంస్థ అయినా బాగా పనిచేయాలి అంటే అన్ని విభాగాలు, యూనిట్లు బాగా పనిచేసి అట్టడుగు స్థాయి నుంచి దృష్టి పెట్టకపోతే వ్యాపారంలో విజయాలు అందుకోలేరు. లక్షాలు సాధించలేరు. ప్రతి విభాగం ఎప్పటికప్పుడు సవాళ్లను ఎదుర్కుంటూ విలువ, నాణ్యత పెంచే సేవలు అందించుకుంటూ పోవాలి. మరీ ముఖ్యంగా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆఫీసులు(పిఎమ్ఒలు) అదే విధంగా పనిచేయాలి. వ్యూహాత్మక లక్షాలు ఛేదిస్తూ మద్దతు కార్యక్రమాలు అందిస్తూ సంస్థను పెద్దది చేసుకుంటూ పోవాలి.
నైపుణ్యం ఉన్న పిఎమ్ఒ సిబ్బంది
సరైన పరిజానం, అవగాహన, నైపుణ్యం ఉన్న సరైన వ్యక్తులను పిఎమ్ఒ సిబ్బందిగా ఎంచుకోవాలి. అత్యంత ఉత్తమమైన పిఎమ్ఒకి ఇది కీలక అంశం. పిఎమ్ఒలో భాగమైన ప్రాజెక్ట్ మేనేజర్లు కేవలం అడ్మినిస్ట్రేటర్లుగా వ్యవహరిస్తే ఎంతసేపటికీ రోజువారీ కార్యక్రమాలు, డెలివరబుల్స్ మీదనే దృష్టి కేంద్రీకరిస్తారు కాబట్టి పిఎమ్ఒ పనితీరు, విశ్వసనీయతను తగ్గిపోతుంది. ముఖ్యంగా సంస్థను ముందుకు నడిపే ప్రతిభావంతంగా ఐటి ప్రాజెక్ట్ డెలివరీ చేయాల్సిన విషయం మూలన పడిపోతుంది. నిజానికి సంస్థలో వ్యూహాత్మక మార్పుగా రావాలి. అందుకే పిఎమ్ఒ కోసం సిబ్బందిని తీసుకుంటున్నప్పుడు, వారు కష్ట సమయంలో మార్పుకు సిద్ధపడగలగినవారు అవునా కాదా చూసుకుని తీసుకోవాలి. పిఎమ్ఒ లో ఉండే ప్రాజెక్ట్ మేనేజర్లకు కమ్యూనికేషన్లో విస్తృత స్థాయిలో సాఫ్ట్‌స్కిల్స్ ఉండాలి. క్లిష్టమైన పరిస్థితులను సంభాళించుకోవడం, ఒప్పించగలిగే నైపుణ్యం, ఎటువంటి స్థితినైనా సులభతరం చేయగలిగే చతురత ఉండాలి. సంస్థలో అన్ని విభాగాలు, యూనిట్లు మొత్తం మీద లక్షాలను ఎలా ఛేదించాలి అనేదాని మీద ఎక్కువ దృష్టి ఉండాలి. అప్పుడే కింది స్థాయి నుంచి విలువ పెంచుకుంటూ వెళ్లగలుగుతారు. అలా చేయకపోతే వ్యాపారం కుప్పకూలి పోతుంది. ఐటి అవచ్చు, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అవచ్చు. అప్పటికప్పుడు ఆదాయంలో గణనీయమైన మార్పు కావాలనుకుంటే యూనిట్లు ఎప్పటికప్పుడు సవాళ్లను ఎదుర్కుంటూ విలువను పెంచుకుంటూ పోవాలి. మరీ ముఖ్యంగా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆఫీసులు మద్దతునిచ్చి సంస్థకు, దాని వ్యూహాత్మక లక్షాలకు విలువను పెంచేవిధంగా ఉండాలి.
ఎక్కువ ప్రాధాన్యత ఉన్న విషయాల మీద దృష్టి
పిపిఎమ్ మెచ్యూరిటీ మెరుగుదల కావాలన్నా, ట్రాక్ రికార్డు ఏర్పరచుకోవాలన్నా, ఉత్తమ ఐటి పెట్టుబడి ఫలితాలు సాధించాలన్నా ‘త్వరగా అయిపోయే’ పని ఏదో గుర్తించి అది మరింత త్వరగా అయిపోయేట్టు చూడాలి. అప్పుడు అత్యధికంగా దృష్టిపెటి తప్పకుండా చేయాల్సిన ముఖ్యమైన పిఎమ్ఒ ప్రాజెక్ట్‌లను వేగవంతంగా పూర్తి చేయడానికి అవకాశం దొరుకుతుంది. పిఎమ్ఒలు చేపట్టిన ఈ ప్రక్రియలో భాగస్వాములు కూడా తమవంతు మద్దతునందించాలి.
వ్యాపార అవసరాలకు తగ్గట్టు రిపోర్టింగ్
పిఎమ్ఒ వ్యాపార ధృక్కోణం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అవసరాన్ని బట్టి మారుతుండాలి. పిఎమ్ఒ కేవలం ప్రాజెక్ట్‌లు, ప్రోగ్రామ్‌ల స్టేటస్ మీద నివేదిక ఇవ్వాలని బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌లు సాధారణంగా కోరుఉంటారు. కాని అది మాత్రమే సరిపోదు. పిఎమ్ఒలు, ప్రాజెక్ట్‌లు, ప్రోగ్రామ్‌లకు సంబంధించిన స్టేటస్ రిపోర్ట్ ఇస్తారు. కాని రిపోర్టింగ్‌లో చెప్పాలనుకున్నది సరిగా చెప్పరని,. ఒక్కోసారి ఆ సందర్భానికి, ఆ రిపోర్టింగ్‌కి సంబంధమే ఉండదని అంటారు చాలామంది బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌లు. అందుకే ప్రతిభావంతంగా నిర్ణయం తీసుకునే విధంగా సంస్థాగత నాయకత్వాన్ని ప్రతిఫలించేట్టు రిపోర్టింగ్ ఉండాలి.
సాధించిన విజయాల్ని హైలైట్ చేయాలి
సంస్థలో పిఎమ్ఒల విజయగాధలను అదనంగా జతచేయాలి. పడిన కష్టనష్టాల గురించి కాకుండా స్పష్టంగా కనిపించే లాభాలను, చూపగలగాలి. ఎంత తక్కువ సమయంలో ప్రాజెక్ట్ పూర్తిచేశారు, ముఖ్యమైన బిజినెస్ ప్రాబ్లమ్స్‌ను ఏ విధంగా పరిష్కరించారని చెప్పగలగాలి.
వినూత్న విషయాలకు మద్దతు
బైమోడల్ ఐటి, డిజిటల్ బిజినెస్ మద్దతు కోసం పిఎమ్ఒను ఏర్పాటు చేసి ప్రతి అభివృద్ధిలో, ఇంకా వినూత్న దిశలో సాగే ప్రాజెక్ట్‌కు సంబంధించిన సేవా నమూనాను పిఎమ్ఒ స్వీకరించాలి. ఉదాహరణకు చాలా ఏళ్ల క్రితమే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడే పిఆర్ఒ ఏర్పడి ఉందనుకోండి. ఇప్పుడు అదే వ్యాపారం ఊపందుకుంది. అందుకని అప్పుడు ఉన్న సిబ్బందితోనే పనికానివ్వకూడదు. కొత్త పోకడ దానిలో కనిపించాలి. ప్రతిభావంతంగా పనిచేసే పిఎమ్ఒ ఎప్పటికప్పుడు దాని శక్తిసామర్థాలను, కార్యక్రమాలను శల్యపరీక్ష చేసుకుని బిజినెస్ ప్రస్తుత అవసరాలకు తగినట్టుగా మారుతూ పనిచేస్తుంది.