Search
Wednesday 26 September 2018
  • :
  • :

నీరవ్ మోడీ, చోక్సీలకు షాక్

pnb-skam (1)

ముంబయి: పిఎన్‌బి స్కాంలో నిందితుల నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలకు మహారాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. నీరవ్, మెహుల్ బంగళాలను కూల్చేయాలని ఫడ్నవీస్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.  పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి) ముంబయి బ్రాంచ్‌లో బిలియనీర్ నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలు రూ.11,400 కోట్లు విలువ చేసే మోసపూరిత లావాదేవీలకు  పాల్పడ్డారు. భారీ కుంభకోణం బయటపడడంతో కేంద్ర ప్రభుత్వం సిబిఐ దర్యాప్తునకు ఆదేశించింది. బ్యాంక్‌ అధికారులు సాయంతోనే ఈ భారీ కుంభకోణం జరిగిందని సిబిఐ వెల్లడించింది. బ్యాంక్‌ అధికారులు నీరవ్‌ నుంచి బంగారం కాయిన్స్, డైమండ్‌ నగలను లంచంగా పుచ్చుకున్నట్టు విచారణలో తేలిన విషయం తెలిసిందే.

Comments

comments