Home తాజా వార్తలు రైతుల ఆత్మహత్యలు బాధాకరం

రైతుల ఆత్మహత్యలు బాధాకరం

Pocharamహైదరాబాద్ : రైతుల ఆత్మహత్యలు ఒక్క తెలంగాణలోనే జరగడం లేదని, వారి ఆత్మహత్యల బాధాకరమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు పెట్టుబడిరాయితీ కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు. రైతులకు రూ.8,500 కోట్లు రుణమాఫీ చేస్తామని శాసనసభ సాక్షిగా చెప్పామన్నారు. శాసనసభలో హుందాగా వ్యవహరించి చర్చిద్దామంటే విపక్షాలు వినలేదన్నారు.