Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ఎన్నికలంటేనే భయపడుతున్నారు…

Pocharam srinivas reddy press meet

కామారెడ్డి : రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలంటేనే కొన్ని పార్టీలు భయపడుతున్నాయని మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బాన్సువాడలోని ఆయన నివాసంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ రద్దు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కెసిఆర్ నియామకం, 105 మంది టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించడం దేశ రాజకీయ చరిత్రలో ఇదే తొలిసారి అని ఆయన పేర్కొన్నారు. ఇంత వరకు ఏ ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీ రద్దు రోజే ఇన్నికార్యక్రమాలు నిర్వహించలేదని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు వస్తాయి. పార్టీల ప్రతినిధులు ఓట్ల కోసం ప్రజల దగ్గరకు వెళ్లి హామీలు ఇస్తారు. ఇచ్చిన హామీలను అమలు చేయని వాళ్లు భయపడాలి కానీ అన్ని హామీలను వంద శాతం నెరవేర్చడమే కాకుండా ఇవ్వని హామీలను కూడా టిఆర్‌ఎస్ సర్కార్ నెరవేర్చిందని వాఖ్యానించారు. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 100 పైగా స్థానాలను గెలుస్తామని పోచారం ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు తమకు విశ్వాసం ఉందని పోచారం శ్రీనివాస్ పేర్కొన్నారు.

Comments

comments