Thursday, April 25, 2024

పోలవరం ముంపు 1.10లక్షల హెక్టార్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గోదావరి నదిపై నిర్మిస్తు న్న పోలవరం ప్రాజెక్టు పనుల్లో వేగం పెరిగింది. ఈ ప్రా జెక్టు పనులకు సంబంధించి తొలి దశ నిధుల వ్యయపు అంచనాలను కేంద్ర జలసంఘం రూ.31,625కోట్లుగా లెక్కతేల్చింది. సిడబ్ల్యూసి ప్రతిపాదించిన అంచనాలను మదింపు ప్రక్రియలో కూడా కేంద్ర ప్రభుత్వం వేగవంతమైన చర్యలు చేపట్టింది. రివైజ్డ్ కాస్ట్ కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ అదేశాలు జారీ చేశారు. నవంబర్ 2లోగా నివేదికను ప్ర ధానమంత్రి అధ్యక్షతన ఏర్పాటైన ప్రాజెక్టు ఇన్విస్టిమెంట్ బోర్డుకు అందజేయాలని కేంద్ర జలసంఘానికి అదేశాలు అందాయి. ఈ నేపధ్యంలో పోలవరం ప్రాజెక్టు పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి దశలవారీగా ప్రాజెక్టులో నీటిని నిల్వచేయాలని ఎపి ప్రభుత్వం కాంట్రాక్టు ఏజెన్సీలకు కొత్త లక్ష్యాలను నిర్దేశించింది. పోలవరం ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటిమట్టం 45.72అడుగులు కాగా, ఆ స్థా యిలో నీటి నిలువ 194.6 టిఎంసీలకు చేరనుంది. అదే జరిగితే తెలంగాణ రాష్ట్రంలోని గోదావరి నదీపరివాహకంగా ఉన్న లోతట్టు ప్రాంతాలపై మునక ప్రభావం తీవ్ర త మరింత పెరిగే ప్రమాదం ఉందన్న ఆందోళనలు పుట్టుకొస్తున్నాయి.

ఇప్పటికే వర్షాకాలం ఎగువ నుంచి వస్తు న్న వరద ప్రవాహంతో గోదావరి నదిలోభద్రాచలం వద్ద నీటిమట్టం గత రెండేళ్లుగా ఆందోళన గొలుపుతూ వస్తోం ది. గత మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి గోదావరినదిలో నీటిమట్టం చేరకముందే గోదావరి నదికి ఇరువైపులా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ దశలో ఉండగానే పోలవరం ప్రా జెక్టు వెనుక జలాల ప్రభావం కూడా తెలంగాణ రాష్ట్ర భూ భాగంపై పడుతోంది. గత ఏడాది భద్రాద్రి కొత్తగూడెం జి ల్లాల్లో గోదావరి నదిపరివాహకంగా ఉన్నలోతట్టు ప్రాం తాలు రోజలు తరబడి పోలవరం బ్యాక్‌వ్యాటర్‌లో ముని గి పంటపొలాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. భద్రాచలం పట్టణాన్ని కూడా గోదావరి వెనుకజలాలు చుట్టేసి కంటిమీద కునుకు లేకుండా చేశాయి. ఇక పోలవరం ప్రాజెక్టులో 45.72అడుగుల స్థాయిలో నీటిని నిలువ చేస్తే ఆ ప్రభావం 137గ్రామాల పరిధిలోని 200 అవాలసాల పై న పడుతుంది. సుమారు 64155 మంది నిర్వాసితులుగా మారనున్నారు. కేంద్ర జలసంఘం కూడా 45.72అడుగుల స్థాయిలో కాంటూర్ లెవల్స్‌ను గుర్తించి ఆ స్థాయి లో నీటిముంపునకు గురయ్యే ప్రాంతాలకు పునరావాసం కల్పిచాలని ఆదేశాలిచ్చింది.

అంతే కాకుండా 1.10లక్షల హెక్టార్ల భూభాగం పోలవరం రిజర్వాయర్ ముంపు ప్ర భావం పడనుంది. తొలిదశ కింద పోలవరం ప్రాజెక్టులో నీటినిల్వ వల్ల ముంపు ప్రభావాన్ని తలచుకుని తెలంగాణలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు వణికిపోతుంటే, ఇక రెం డవ దశ నీటినిల్వ ప్రభావం మరింత ఆందోళన గొలుపుతోందంటున్నారు. పోలవరం ప్రాజెక్టులో తొలిదశ కింద 41.15 మీటర్ల స్థాయిలో 119.4టిఎంసీలు నిల్వ చేయనున్నారు. ఈ స్థాయిలో నీటినిల్వకు సంబంధించిన ముంపుపై ఇటీవల లైడార్ సర్వే చేసి 90గ్రామాల పరిధిలోని 171ఆవాసాలపై ముంపు ప్రభావం పడనుందని అంచనా వేశారు. 37568మంది నిర్వాశితులుగా మారనున్నుట్టు లెక్కతేల్చారు. ఇందులో ఇప్పటివరకూ 12678మందికి మాత్రమే పునరావాసం కల్పించారు. ఇంకా 24910మందికి పునరావాసం కల్పించాల్సి వుంది.ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి.

తొలిదశ నీటినిల్వకు సిడబ్ల్యూసి మార్గదర్శకాలు
పోలవరం ప్రాజెక్టులో తొలిదశ కింద 41.15మీటర్ల స్థాయిలో 119 టిఎంసీల నీటినిల్వకు కేంద్ర జలసంఘం మార్గదర్శకాలు రూపొందించింది. ఈ మార్గదర్శకాలమేరకే ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసి రిజర్వాయర్‌లో ఏవైనా లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకుంటూ రానున్నారు. పునరావాసం కల్పించి ముంపు ప్రాంతాలను పూర్తిగా ఖాళీ చేయించాకే రెండద దశకింద 45.72మీటర్ల స్థాయిలో 194టిఎంసీల నీటిని నిల్వ చేస్తామని కేంద్ర జలసంఘం అధికారులు చెబుతున్నారు.
అభ్యంతరాలు లెక్కచేయకుండానే…
పోలవరం ముంపు సమస్యలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెలిబుచ్చుతున్న సందేహాలు,ఉమ్మడి సర్వేద్వారా ముంపు ప్రాంతాల ఖచ్చితమైన నిర్ధారణ తదితర పనలు ఏవి పట్టించుకోకుండానే పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఒడిశా , చత్తిస్‌గఢ్ రాష్ట్రాల్లో కూడా ముంపు సమస్యలపై ప్రజాభిప్రాయ సేకరణలో సమగ్రత లేకుండా పోయిందన్న విమర్శలు వినవస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు తొలిదశ అంచానాలను రూ.31625కోట్లుగా లెక్కతేల్చి వాటికి సంబంధించిన నివేదికను రివైజ్డ్ కాస్ట్ కమిటీకి అప్పగించి ఈ కమిటీ ద్వారా ప్రధానమంత్రి అధ్యక్షతన పనిచేసి ప్రాజెక్టు ఇన్విస్టిమెంట్ బోర్డు కు అందచేసేందకు చేస్తున్న కసరత్తుల పట్ల తెలంగాణతోపాటు చత్తిస్‌గఢ్ , ఒడిశా రాష్ట్రాలనుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తమ తమ రాష్ట్రాల్లో ముంపు సమస్యలకు శాశ్విత ప్రాతిపదికన పరిష్కారం చూపాకే పోలవరం ప్రాజెక్టు పనుల్లో కేంద్రం ముందుకు కదలాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News