Home తాజా వార్తలు ఇద్దరు అంతర్‌రాష్ట్ర దొంగల అరెస్టు

ఇద్దరు అంతర్‌రాష్ట్ర దొంగల అరెస్టు

two interstate thieves

 

మంచిర్యాల: చెడువ్యసనాలకు అలవాటుపడి విలాసవంతమైన జీవితాలకు డబ్బులు సరిపోక చిన్నతనం నుండే దొంగతనాలకు పాల్పడుతూ పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఇద్దరు అంతర్‌రాష్ట్ర దొంగలను మంచిర్యాల జిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. రాత్రి వేళల్లో ముసుగులు ధరించి తాళం వేసి ఉన్న ఇండ్లతో పాటు బైక్ దొంగతనాలకు పాల్పడుతూ తప్పించుకొని తిరుగుతున్న నిందితులిద్దరిని పట్టుకుని వారి వద్ద నుండి పెద్ద మొత్తంలో బంగారం, వెండి అభరణాలను స్వాధీనం చేసుకొని కటాకటాల వెనక్కిపంపించారు. ఈకేసుకు సంబంధించిన వివరాలను బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ కమిషనర్ వి.సత్యనారాయణ వెల్లడించారు.

మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రాంతానికి చెందిన టేకం రాము, పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బొగంపల్లి గ్రామానికి చెందిన రాంటెంకి సారయ్య అనే ఇద్దరు అంతర్‌రాష్ట్ర దొంగలను పట్టుకోగా వారి వద్ద నుండి 74.42 తులాల బంగారు అభరణాలు, కిలోన్నర వెండి అభరణాలతో పాటు ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సిపి వెల్లడించారు. వీటి విలువ రూ. 11లక్షల 83వేలు ఉంటుందని సిపి తెలిపారు. టేకం రాములుపై మంచిర్యాల, భూపాలపల్లి, హన్మకొండ జిల్లాల పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో 12 కేసులు ఉన్నట్లు తెలిపారు. మందమర్రి ప్రాంతంలోని సిఎస్‌పిలో బొగ్గు, స్క్రాప్ దొంగతాలకు పాల్పడి చిన్నతనంలోనే అరెస్టు అయి నిజామాబాద్ జూవెనైలిహోం లో శిక్ష అనుభవించాడని, బయటకు వచ్చిన తర్వాత కూడా వరుసగా దొంగతనాలకు పాల్పడు తూ తప్పించుకొని తిరుగుతున్న టేకం రామును మంగళవారం మంచిర్యాల పట్టణంలోని ఐబి ప్రాంతంలో అనుమానంగా ఎస్‌ఐ ఓంకార్ ఆధ్వర్యంలో క్రైంటీం అతనిని విచారించగా చేసిన నేరాలు ఒప్పుకున్నట్లు తెలిపారు.

Police arrested by two interstate thieves in Mancherial