Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

చోరీ కేసును ఛేదించిన పోలీసులు…

Robbery-Recovery

నిజామాబాద్: ఆర్మూర్ లో జరిగిన బంగారం చోరీ కేసును గురువారం పోలీసులు ఛేదించారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన భూపాల్ మున్నా అనే వ్యక్తి మూడు కిలోల బంగారంతో ఉడాయించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని కటక్ లో అరెస్ట్ చేశారు. భూపాల నగల తయారీ కోసం దుకాణదారులు ఇచ్చిన బంగారంతో పారిపోయాడు. ఆర్మూర్ కోర్టు నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించింది.  ఆర్మూర్ కు చెందిన తన మిత్రులకి కొంత బంగారం ఇచ్చినట్టు విచారణలో నిందితుడు తెలిపాడు. ఆ ముగ్గురి నుంచి 617 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనపర్చుకున్నారు.

Comments

comments