Search
Sunday 22 July 2018
  • :
  • :

డ్రంక్ అండ్ డ్రైవింగ్‌లో ముగ్గురికి జైలు శిక్ష…

Police Arrested Three Person In Drunk And Drive Case

పాలకుర్తి : పాలకుర్తి మండల కేంద్రంలో సోమవారం పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవింగ్ చెకింగ్‌లో పట్టుబడిన ముగ్గురికి జరిమానతో పాటు జైలుశిక్ష విధించినట్లు ఎస్సై నీలోజు వెంకటేశ్వర్లు తెలిపారు. గూడురుకు చెందిన కంచెర్ల సోమన్నకు రూ.2వేల జరిమాన, ఏడు రోజుల జైలుశిక్ష, నకిరేకల్‌కు చెందిన లింగేశ్‌కు రూ.2వేల జరిమాన, రెండు రోజుల జైలుశిక్ష, లక్ష్మక్కపల్లికి చెందిన వాంకుడోతు రమేష్‌కు రూ.2వేల జరిమాన, ఒకరోజు జైలుశిక్ష విధించినట్లు ఎస్సై తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ వల్ల ప్రాణ నష్టం వాటిల్లుతుందన్నారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Comments

comments