Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

అలివి వలలపై పోలీసుల ఉక్కు పాదం

9మందిని అదుపులోకి తీసుకున్న సిఐ

Police1పెబ్బేరు: మత్స సంపదకు ఖన్నం వేసే ఆంధ్రా పెత్తందార్లకు తెలంగాణ పోలీసులు సవాలుగా మారారు. మండల పరిధిలోని యాపర్ల గ్రామంలో కృష్ణానది బ్యాక్‌వాటర్‌లో గత కొన్ని రోజులుగా అలివి వలలతో చేపలు పడుతున్న అంతరాష్ట్ర (మహారాష్ట్ర, ఒరిస్సా, ఆంధ్రా) వారిని పోలీసులు చాకచక్యంగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. శుక్ర,శని వారాల్లో జరిగిన దాడుల్లో భారీ విలువైన అలివి వలలు స్వాధీనం చేసుకున్నట్లు సిఐ జి. శ్రీనివాస్ తెలిపారు. ఇటీ వల నియామకం జరిగిన గ్రామ పోలీస్ అధికారి రాజు అలివి వలల పై ప్రత్యేక దృష్టి సాధించడంతో పట్టు బడినట్లు తెలిపారు. రాత్రి వేళల్లో కృష్ణానదిలోకి దిగి చేపలను పడుతూ , ఉదయం వేళల్లో గుడారాల్లో కూలీ పనులు చేసుకుంటున్నట్లు నమ్మించి ఈ దోపిడికి తెర లేపారు. మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన దీపక్, ఒరిస్సాలోని రాయఘడ్ కు చెందిన సంజయ్‌కుమార్, భరంపూర్‌కు చెందిన రాజ్‌కుమార్, ఎపి కొవ్వూరుకు చెందిన గరిక శ్రీను ,గరిక రమణ, తూనికి చెందిన కాపుల అప్పల రాజు, విజయనగరంకు చెందిన సోలిపల్లి రాజు, శ్రీకాకుళంకు చెందిన రామారావు, లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
నిలువుదోపిడి
గత 5 , 6 సంవత్సరాలుగా అలివి వలలతో తెలంగాణ ప్రాంతానికి చెందిన మత్ససంపదను దోపిడి చేస్తున్నప్పటికి ఇటు మత్సశాఖాధి కారులు గాని, పోలీసులు గాని నామమాత్రపు కేసులు నమోదు చేస్తున్నారు. దీనితో వారు సాధా రణకేసులే అని డిశంబర్ , జనవరి మాసాల్లో వచ్చి నిలువు దోపిడికి పాల్పడుతున్నారు. అలివి వలల్లో గుండు సూది కూడా బంది కావల్సి రావడంతో చిన్న చేపలు, పెద్ద చేపలు సైతం వాటికి చిక్కడంతో వారు

వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా మార్చుకుంటున్నారు.

ఒక్కొక్క అలవి వల సుమారు రూ లక్ష నుండి లక్ష యాబై వేల వరకు విలువ ఉంటుందని ,సుమారు 10 వలలు ,ఎండుచేపలు, వారి వద్ద లభించినవి. కొత్తకోట సిఐ శ్రీనివాస్ పకడ్బందీగా వారి స్థావరాలపై దాడులు నిర్వహించడంతో కొంత మంది పరారు కాగా, 9 మంది ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్ సాగర్ తెలిపారు.

మత్సశాఖా మలినమైపోయినది…
తెలంగాణ ప్రభుత్వం మత్సశాఖకు ప్రాధాన్యత ఇచ్చినప్పటికి ఆ శాఖా మలినమైపోయిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. పెబ్బేరు మండలంలో ప్రభుత్వం నిషేధించిన క్యాట్‌ఫిష్ , అలివి వలలతో చేపలు పడుతున్నప్పటికి చూసి చూడనట్లుగా వ్యవహరిస్తూ, చేయి చాపుతున్నారని విమర్శలు మెండుగా వినిపిస్తున్నాయి.

Comments

comments