Home జనగామ వాహనదారుల రక్షణే కుటుంబ రక్షణ

వాహనదారుల రక్షణే కుటుంబ రక్షణ

Police awareness on traffic Rules

రఘునాథపల్లి: వాహనదారుల రక్షణే కుటంబ రక్షణ అని రఘునాథపల్లి సిఐ బి.తిరుపతి అన్నారు.జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా గురువారం మండల కేంద్రంలోని హైస్కూల్ నుండి బస్ స్టేషన్ వరు కు పోలీసుల ఆద్వర్యంలో విధ్యార్దులు,వాహనదారులు,ఆటో డ్రైవర్లతో బారీ ర్యా లీ నిర్వహించారు.సిఐ తిరుపతి,ఎస్‌ఐ పి రంజిత్‌రావు స్వయంగా బస్సు,లారీ డ్రైవర్లకు స్వీట్లు,గులాబి పువ్వులు అందించి రోడ్డు భద్రత ప్రయాణాలను ప్రతి ఒక్కరు విధిగా పాటించాలని కోరారు.రోడ్డుభద్రత ప్రమాదాలు పాటిస్తు ప్రమాదాల నివారణకు అంకిత భావంతో కృషి చేస్తామని వాహనదారులు,ఆటో డ్రైవర్లు ప్రతిజ్ఞ చేశారు.

ఈ సందర్భంగా సిఐ తిరుపతి మాట్లాడుతూ మద్యం సే వించి వాహనాలు నడపకూడదని,ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపకూడదని,మీ భద్రతే మీ కుటుంబానికి రక్షణ అని,వేగం కన్న ప్రాణం మిన్నఅని, వాహనాదారులు రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంపొంది ంచుకొ ని సురక్షిత ప్రయాణాలతో క్షేమంగా గమ్యం చేరుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ రంజిత్ రావు,పోలీస్ సిబ్బంది సుధాకర్,శ్రీని వాస్,గపాల్ రెడ్డి,సత్యనా రాయ ణ,యాద గిరి,హైస్కూల్ ప్రధానొపాద్యయుడు సంపత్‌కు మార్,పిడి చంద్రసేణా రెడ్డి,సురేం దర్ తదితరులు పాల్గొన్నారు.

కమలాపూర్‌లో…

మా పూలు మీ భద్రతకే అంటూ వినూత్నతరహాలో ప్రచారంకు శ్రీకారం చు ట్టారు కమలాపూర్ పోలీస్‌లు.రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా నిబం ధనలు పాటించని వాహనదారులకు గులాబీ పూలను అందజేసి అవగాహన కల్పించారు పోలీస్‌లు.17 నుండి 23 వరకు జరిగే రోడ్డు భద్రతా వారో త్సవాలపై కమలాపూర్ ఎస్సై ఎ ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్‌లు వినూత్న ప్రచారంకు తెరలేపి వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన చేప ట్టారు.అందులో భాగంగా స్థానిక బస్టాండ్ కూడలీ వద్ద వాహనాలు నడుపుతూ హెల్మెట్ లేని ద్విచక్ర వాహనదారులు,సీట్ బెల్టు లేకుండా కారు నడుపుతున్న వారికి,త్రిబుల్ రైడర్లకు,మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి రోడ్డు భద్రత ముఖ్యమంటూ గులాబీ పూలు అందజేసి ప్రచారం చేసారు.

వారోత్సవాలను పురస్కరించుకోని చేపట్టిన కార్యక్రమంలో పోలీస్‌లు రోడ్డు భద్రతపాటించని వా హనదారులకు ఎలాంటి అపరాధ రుసుములు వేయకుండా ఒక్క రోజు గులాబీ పూలను అందజేసి రోడ్డుభద్రత వలన కలుగు ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎస్పై ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ వాహ నదారులు తప్పక అన్ని రకాల డాక్యూమెంట్స్‌ను కలిగివుండి రోడ్డు భద్రతను పాటించాలని,మద్యం సేవించి వాహనాలు నడుపవద్దని సూచించారు.అలాగే ద్వి చక్ర వాహనదారులు హెల్మేట్ లేనిదే వాహనాలు నడుపవద్దని హెల్మేట్ వాడటం ఎంతో శ్రేయస్సకరమని తెలిపారు.పరిమితికి ప్రయాణికులను తీసుకెళ్ళవద్దన్నారు.రోడ్డు భద్రతలను పాటించని వాహనదారులపై శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ కన కయ్య, విఠల్,శంకర్,రవి, శ్రీను,శ్యాం, తదితరులు పాల్గ్గొన్నారు.