Home రంగారెడ్డి హర హర మహాదేవ

హర హర మహాదేవ

ph

శంభో శివ శంకర.. హర హర మహాదేవ

భక్తులతో కిటకిటలాడిన దేవాలయాలు
శ్రీఉత్తర రామలింగేశ్వర స్వామి దర్శించుకునేందుకు
పోటెత్తిన జనం సందోహం
ఉపవాస దీక్షలతో భక్తితో భక్తుల అభిషేకాలు, నైవేద్యాలు
రామేశ్వరంలో పోలీసు భారీ బందోబస్తు

షాద్‌నగర్ : హర హర.. మహాదేవ.. శంభో శంకర.. హర హర మహాదేవా.. అంటూ భక్తులు ఉత్తర రామలింగేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు…. మహాశివరాత్రి పర్వదినం సందర్బంగా మంగళవారం షాద్‌నగర్ నియోజక వర్గంలోని ఆయా దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.. షాద్‌నగర్ పట్టణంతో పాటు ఆయా మండలాల్లో గల పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఫరూఖ్‌నగర్ మండలం రాయికల్ గ్రామంలో గల శ్రీ ఉత్తర రామలింగేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు ఉదయం 4 గంటల నుండే స్వామి వారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో పోటెత్తారు. ఉదయం నుండి రాత్రి వరకు స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు నియోజక వర్గంతో పాటు పలు జిల్లాల నుండి అధిక సంఖ్యలో రావడంతో ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో కిక్కిరిసి పోయింది. అదే విధంగా షాద్‌నగర్ పట్టణంలోని శ్రీ జానంపేట వెంకటేశ్వర స్వామి దేవాలయం, శ్రీ శివమారుతి గీతా అయ్యప్ప మందిరం, చౌడమ్మగుట్టలోని ఆంజనేయ స్వామి దేవాలయం, శ్రీ కన్యకాపరమేశ్వరి దేవాలయం, రాఘవేంద్రస్వామి దేవాలయంతో పాటు దత్తాత్రేయ దేవాలయంతో పాటు ఆర్టిసి, అయ్యప్ప కాలనీ, బస్టాండ్ సమీపంలో గల పరిగి రోడ్డులోగల హనుమాన్ దేవాలయంలో, కమ్మదానంలో పంచముఖ హనుమాన్ దేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుండి భక్తితో శివ నామస్మరణతో నైవేద్యాలు తయారు చేసి భక్తులు స్వామికి నైవేద్యం సమర్పించి ఉపవాస దీక్షలు పండ్లు, పాలతో విడిచి పెట్టారు. రాత్రికి జాగరణ చేసి ఉదయం స్వామికి ప్రత్యేకంగా తీపి వంటకాలు తయారు చేసి మహాశివరాత్రి ఉప వాస దీక్షలు వదిలిపెడుతారు. జానంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ ఉత్తర రామలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద భక్తులు అధిక సంఖ్యలో రావడంతో షాద్‌నగర్ ఎసిపి సురేందర్ ఆద్వర్యంలో టౌన్ సిఐ అశోక్ కుమార్ , ఎస్సై విజయ్ కుమార్ , సిబ్బంది భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్కింగ్, క్యూలైన్లలో ఇబ్బందులు ఏర్పడకుండా ఎప్పటికి అప్పుడు చర్యలు చేపట్టినట్లు వారు తెలిపారు. మహాశివరాత్రి పర్వదినం సందర్బంగా పండ్ల వ్యాపారులకు కలిసి వచ్చింది. పండ్ల రేట్లను అమాంతం పెంచడంతో భక్తులు చేసేదేమిలేక కొనుగోలు చేశారు.
పోలీసుల బందోబస్తు ఇలా..
రామేశ్వరంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉత్తర రామలింగేశ్వర స్వామి దేవాలయంలో పోలిసులు భారీ బంధోబస్తును షాద్‌నగర్ ఎసిపి సురే్ందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.బందోబస్తులో భాగంగా షాద్‌నగర్, నందిగామ, కేశంపేట, చౌదరిగూడ, కొత్తూర్, కొందుర్గు, కడ్తాల్, ఆమన్‌గల్ 2 సిఐలు అశోక్ కుమార్,రూరల్ సిఐ మధు సూధన్,పట్టణ ఎసై విజయ్ కుమార్‌తో పాటు,9 మంది ఎస్సైలు, 80 మంది కానిస్టేబుల్ సిబ్బందిని కేటాయించినట్లు ఎసిపి సురేందర్ తెలిపారు. వీరిలో ఇద్దరు ఎఎస్సైలు, 5 మంది కానిస్టేబుల్‌లు సిసి కెమెరాల పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా శివరాత్రి పురస్కరించుకొని రామేశ్వరానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత పోలీస్ సిబ్బంది, ఆలయ నిర్వాహకులదేనని వెల్లడించారు. మరుగుదొడ్లు, స్నానాల గదులు, పార్కింగ్ స్థలం కేటాయింపు తదితర అంశాలపై పర్యవేక్షణ చేపట్టారు. అంతే కాకుండా అగ్ని మాపక వాహనం, 104,108,ఆరోగ్య క్యాంపు అందుబాటులో ఉన్నట్లు, చెత్తను ఎప్పటికి అప్పడు తీసివేసేందుకు గ్రామపంచాయతీ కార్మికులను కేటాయిస్తున్నట్లు తెలిపారు. రామేశ్వరానికి దైవ దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరు ఇక్కడి నిబంధనల మేర నడుచుకుంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా దర్శనం చేసుకోవాలని.. ఆలయ నిర్వాహకులకు, పోలీస్ సిబ్బందికి సహకరించాలని లేని ఎడల చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతే కాకుండా రామేశ్వరంలో స్వచ్చంద సంస్థలు నిర్వహించే కార్యక్రమాలపై పోలీసులకు సమాచారం అందించాలని ఆయన సూచించారు.
చౌదరిగూడలో..
మహాశివరాత్రి సందర్బంగా మండల కేంద్రంతో పాటు పెద్దఎల్కిచర్ల, జిల్లెడ్, వీరన్నపేట, జాకారం, చేగిరెడ్డి ఘనాపూర్‌తో పాటు తదితర గ్రామాల్లో మంగళవారం శివాలయాలు భక్తులతో కిక్కిసిరి పోయాయి. ఉదయం నుండి స్వామివారికి భక్తులు అభిషేక కార్యక్రమాలు నిర్వ హించారు. సాయంత్రం నాలుగు గంటల నుండి ఉపవాస దీక్షలు విడిచిపెట్టేందుకు భక్తులు దేవాలయాలకు అధిక సంఖ్యలో రావడంతో దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిసాయి.
కొత్తూర్, నందిగామలో..
కొత్తూర్, నందిగామ మండల కేంద్రాల్లోని దేవాలయాల్లో భక్తులు మహాశివరాత్రి సందర్బంగా మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం వేళ భక్తులు ఉప వాస దీక్షలు విడిచి పెట్టేందుకు దేవాలయాలకు రావడంతో దేవాలయం భక్తులతో కిక్కిరిసి పోయాయి. అదే విధంగా దేవాలయాల వద్ద భక్తుల సౌకర్యార్థం దేవాలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.