Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

బిటెక్ రవి దీక్ష భగ్నం

Police Breaks MLC Btech Ravi Hunger Strike

కడప : కడపలో ఉక్కు పారిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బిటెక్ రవి చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను బుధవారం సాయంత్రం పోలీసులు భగ్నం చేశారు. ఎనిమిది రోజులుగా టిడిపి ఎంపి సిఎం రమేష్‌తో కలిసి ఆయన దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రవి ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. రవి సుగర్, బిపి స్థాయి ప్రమాదకర స్థాయికి చేరుకుందని వైద్యులు తెలిపారు. రవికి తక్షణ చికిత్స అందించకపోతే ఆయన ప్రాణాలకే ప్రమాదం ఉందని వైద్యులు పోలీసులకు నివేదిక ఇచ్చారు. దీంతో ఆయన దీక్షను భగ్నం చేసి కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సిఎం రమేష్ తన దీక్షను కొనసాగిస్తున్నారు. రవి దీక్షను భగ్నం చేసే క్రమంలో టిడిపి కార్యకర్తలు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో దీక్షా శిబిరం వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.

Police Breaks MLC Btech Ravi Hunger Strike

Comments

comments