Home నిజామాబాద్ నవీపేట్ పిఎస్ పరిధిలో కార్డెన్ సెర్చ్

నవీపేట్ పిఎస్ పరిధిలో కార్డెన్ సెర్చ్

Police CardenSearch In Naveepet In NizamabadDist

నిజామాబాద్ క్రైం ః నవీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్‌నగర్ కాలనీలో నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కార్తీకేయ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 4గంటల నుండి 6గంటల వరకు కార్డెన్‌సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్బంగా నిజామాబాద్‌లో నేరాల నియంత్రణలో భాగంగా ముందు జాగ్రత్తగా నవీపేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సుభాష్‌నగర్ ప్రాంతంలో అనుమానితులను ఆరాతీసి, క్రిమినల్స్ ఎవరైనా షెల్టర్ తీసుకుంటున్నారా, పాత నేరస్థులు ఉంటున్నారా లేదా ఆరా తీసి, ప్రతి వాహనదారుల వాహనాల డాక్యూమెంట్లు ఉన్నాయా లేదా అని వారిని ఆరా తీశారు. ఈ సందర్బంగా ఎలాంటి కాగితాలు, నెంబర్‌ ప్లేట్లు లేని మొత్తం 67 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, 2 కార్లు, అనుమానితులు ఇద్దరిని ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా సిపి మాట్లాడుతూ ఇప్పటి వరకు నిజామాబాద్‌లోని మర్చికంపౌండ్, చంద్రశేఖర్‌కాలనీలో, ఆర్మూర్, టౌన్ 3, బోధన్, నిజామాబాద్‌రూరల్, నందిపేట్ పియస్ పరిధిలో ఈ కార్డెన్‌ సర్చ్ నిర్వహించడం జరిగిందని సిపి తెలిపారు. కొత్త వ్యక్తులకు ఇంటిని కిరాయికి ఇచ్చేటప్పుడు వారి పూర్తి సమాచారం తెలుసుకోవాలన్నారు. కొత్త వ్యక్తులు కాలనీలో తిరిగినట్లయితే ముందుగా అట్టి సమాచారం తెలిసిన వారి దగ్గరలోని పోలీస్ వారికి సమాచారం అందించాలని అన్ఈనారు. కార్టెన్‌సెర్చ్ సందర్బంగా స్థానిక ప్రజలు పోలీస్‌ వారికి పూర్తిగా సహకరించడం జరిగింది. రోడ్డు సేప్టిలో భాగంగా ప్రతి ఒక్కరు నెంబర్‌ప్లేట్లు, హెల్మెట్ ధరించాలని, వాహనం మంచి కండిషన్‌లో ఉంచుకోవాలన్నారు. ప్రజల సమస్యలపై డయల్ 100ను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రస్తుతం పోలీస్‌లో అన్ని పనులను టెక్నాలజిని ఎక్కువగా ఉపయోగిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డి.సి.పి(అడ్మిన్) ఆకుల రాంరెడ్డి, నిజామాబాద్, బోధన్ ఎ.సి.పిలు సుదర్శన్, రఘు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్‌ఫెక్టర్ రాజశేఖర్, సిఐలు 8, ఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు 200మంది, పోలీస్ సిబ్బంది 31మందితో పాటు మహిళ పోలిస్‌సిబ్బంది, సర్పంచ్ భూంరెడ్డి, మజీద్, ప్రెసిడెంట్ మహ్మద్ అల్తాప్‌ఉద్దీన్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.