Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

శ్రీరెడ్డిని అరెస్ట్ చేయాలి…

police case file against actress sri reddy

చెన్నై: తమిళ చిత్రపరిశ్రమలోని నటీనటులపై తెలుగు నటి శ్రీరెడ్డి తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. అయితే  శ్రీరెడ్డిపై నటుడు వారాహి చెన్నై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. టాలీవుడ్ లోని పలువురు ప్రముఖులపై శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసి డబ్బులు వసూలు చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పుడు టాలీవుడ్‌ను వదిలేసిన శ్రీరెడ్డి కోలీవుడ్‌పై పడిందని తీవ్రంగా ఆరోపించారు. వ్యభిచారాన్ని అంగీకరించిన శ్రీరెడ్డిని అదే కేసులో అరెస్టు చేయాలని వారాహి తన ఫిర్యాదులో డిమాండ్ చేశారు. శ్రీరెడ్డి సంచలన ఆరోపణలతో మరోసారి వివాదానికి తెరలేపింది. ప్రముఖ దర్శకుడు ఎఆర్‌ మురుగదాస్, సుందర్‌.సి, నటుడు రాఘవ లారెన్స్, శ్రీకాంత్‌ తెలుగులో శ్రీరామ్‌ తదితరులపై శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేస్తోంది. నడిగర్‌ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్, కోశాధికారి కార్తీ  హెచ్చరించినా శ్రీరెడ్డిలో మార్పు కనిపించడం లేదంటున్నారు కోలీవుడ్ నటులు. ప్రస్తుతం ఆమె చెన్నైలో మకాం వేసి మరీ ఇలాంటి ఆరోపణలు చేస్తోంది. తను చేస్తోన్న ఆరోపణలపై కోలీవుడ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా నటి త్రిష మాట్లాడుతూ శ్రీరెడ్డి ఎవరో తనకు తెలియదని చెప్పారు. అంతేకాకుండా ఆమె ఆరోపణలకు బదులివ్వాల్సిన అవసరం తనకు లేదని ఖరాఖండిగా  చెప్పారు.

Comments

comments