Home తాజా వార్తలు ‘ సత్యమేవ జయతే ’ సినిమాపై కేసు నమోదు

‘ సత్యమేవ జయతే ’ సినిమాపై కేసు నమోదు

Hyderabad : Police Case filed against Satyameva Jayate film

హైదరాబాద్ : బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం నటిస్తున్న ‘ సత్యమేవ జయతే’ సినిమాపై హైదరాబాద్‌లో పోలీసు కేసు నమోదైంది. ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. మతపరమైన భావాలను కించపరిచారని పేర్కొంటూ షియా వర్గానికి చెందిన ముస్లింలు సినీ నిర్మాతలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమాలో చూపించిన మాతం (మొహర్రం రోజున జరిగే ఊరేగింపు) సీన్లపై షియా వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాలో ఈ సీన్లను తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అవినీతిని అంతం చేయాలన్న కథాంశంతో ఈ సినిమా ఉంటుంది. సత్యం, అవినీతి రహిత సమాజం కోసం పోరాడే వీర ప్రతాప్ సింగ్ పాత్రలో జాన్ అబ్రహం నటిస్తున్నారు. ఈ సినిమాకు మిలాప్ మిలన్ జావేరీ దర్శకత్వం వహిస్తున్నారు.

Police Case filed against Satyameva Jayate film