Home తాజా వార్తలు శ్రీరెడ్డిపై కేసు నమోదు

శ్రీరెడ్డిపై కేసు నమోదు

Sri-Reddy, Sri Reddy's New Tweet On Casting Couch in Tollywood

హైదరాబాద్: టాలీవుడ్‌లో కాస్టింగ్‌కౌచ్‌పై పోరాడుతున్న సినీనటి శ్రీరెడ్డిపై పవన్ కల్యాణ్ అభిమానులు తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు. తన అభిమాన నటుడు పవన్‌ను శ్రీరెడ్డి కించపరిచారని పంజాగుట్ట కాలనీకి చెందిన వీడియో ఎడిటర్ శశాంక్ వంశీ మంగళవారం పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం శ్రీరెడ్డి అభ్యంతర వ్యాఖ్యలు చేశారని, ఆమెపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. వంశీ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ గురనాథ్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వంశీతో పాటు ఎస్‌ఆర్‌నగర్ పిఎస్‌లోనూ పవన్ అభిమాని ప్రియాంక కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.