Home జాతీయ వార్తలు కత్తి మహేశ్‌పై కేసు నమోదు

కత్తి మహేశ్‌పై కేసు నమోదు

Police Case was Registered Against Kathi Mahesh

హైదరాబాద్ : హిందువుల ఆరాధ్యదైవమైన శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టాలీవుడ్ క్రిటిక్ కత్తి మహేశ్‌పై కెపిహెచ్‌బి కాలనీ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కత్తి మహేశ్‌పై చర్యలు తీసుకోవాలని హిందూ జనశక్తి నేతలు ఫిర్యాదు చేయడంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఓ న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ … రామాయణం అనేది ఓ కథ అని, రాముడనే వ్యక్తి ఎంత ఆదర్శవంతుడో, అంత దగుల్బాజీ అని ఆయన వ్యాఖ్యానించారు. రావణుడితోనే సీత ఉంటే ఆమె బాగుండేదేమోనని, ఆమెకు న్యాయం జరిగేదేమోనని తాను భావిస్తున్నట్టు కత్తి పేర్కొన్నారు. కత్తి వ్యాఖ్యలపై హిందూ జనశక్తి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Police Case was Registered Against Kathi Mahesh