Home ఖమ్మం అక్రమంగా తరలిస్తున్నా రూ.40 లక్షల గంజాయి పట్టివేత

అక్రమంగా తరలిస్తున్నా రూ.40 లక్షల గంజాయి పట్టివేత

ganja1204
హైదరాబాద్: ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలంలో సుమారు రూ. 40 లక్షల విలువగల గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలలోకి వెళితే.. విశాఖపట్నం నుంచి మహారాష్ట్రలోని తుల్జాపూర్‌కు సీజీ04 0685 నంబరు గల లారీ బొగ్గు లోడుతో వెళ్తున్నది. పెనుబల్లి మండలం వీయంబంజర రింగుసెంగర్‌లో ఎస్‌ఐ నరేష్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానంతో లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించడంతో విషయం బయటపడింది.
లారీ నుంచి సుమారు రూ. 40 లక్షల విలువైన 6.20 క్వింటాళ్ల గంజాయి మూటలను స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్ ఫయాజ్ , కర్నాటకకు చెందిన లక్ష్మణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.