Search
Friday 21 September 2018
  • :
  • :

పారిపోయిన దొంగ దొరికాడు

Thief

కరీంనగర్ క్రైం: కరీంనగర్ జిల్లాలో సంచలనం సృష్టించిన కేసును వన్‌టౌన్ క్రైం పోలీసులు చేధించారు. ఈ నెల ఐదవ తేది ఉదయం వన్‌టౌన్ పోలీసుల కళ్లుకప్పి అత్తినేని చంద్రమోహన్ అలియాస్ చందును పారిపోయాడు. రిమాండ్ ఖైదిగా ఉన్న చందును జ్యూడిషియల్ కష్టడికి తీసుకున్న వన్‌టౌన్ పోలీ సులు ఓ దొంగతనం కేసులో విచారణ జరుపుతున్న సమ యంలో కాలకృత్యాలు తీసుకునేందుకు ఎస్కార్ట్ కానిస్టేబుల్ తో సహా టాయిలెట్‌లోకి వెళ్ళిన దొంగ కాలుకు ఉన్న సంకెళ్ళుతో సహా ప్రహారిగోడ పై నుండి దూకి సంకెళ్లతో సహా పారిపోయాడు. సదరు దొంగను వన్‌టౌన్ పోలీసులు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకొని బుధవారం పోలీస్ కమీషనర్ సదరు దొంగను విలేకరుల సమావేశంలో ప్రవేశాపెట్టారు. సిపి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

చోరీ కేసులో అరెస్ట్ అయిన దొంగ చందు

గత నెల 19 తేదిన కరీంనగర్ నగరంలోని బోయివాడలో జరిగిన భారీ దొంగతనం కేసులో జగిత్యాల జిల్లా రాయికల్ మండల అయోధ్య గ్రామానికి చెందిన అత్తినేని చంద్రమోహన్ అలియాస్ చందును కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన చందును సిపి కమలాసన్ రెడ్డి విలేకరుల సమావేశంలో ప్రవేశాపెట్టి వివరాలు వెళ్ళడించారు. కేసు నమోదు చేసుకొని కోర్టులో హజరుపరిచి మున్సిఫ్ మేజిస్ట్రేట్ ఆదేశాలతో జిల్లా జైల్‌లో రిమాండ్ చేశారు. అయితే బోయివాడలో చోరిచేసిన కేసు విచారణ పూర్తి కానందున మేజిస్ట్రేట్ ఆదేశాలతో రెండు రోజుల తర్వాత వన్‌టౌన్ పోలీసులు చందు కస్టడికి తీసుకున్నారు.

ఎస్కార్ట్ కానిస్టేబుల్ కళ్ళుగప్పి పరారీ

మేజిస్ట్రేట్ ఆదేశాలతో చందును కస్టడికి తీసుకున్న వన్‌టౌన్ పోలీసులు బోయివాడ చోరీ కేసుకు సంబంధించి విచారణ చేస్తున్నారు. కాగా ఈనెల 5వ తేది ఉదయం 6 గంటల 45 నిమిషాలకు నిందితుడు చందు కాలకృత్యాలు తీసుకునేందుకు వెళ్తానని చెప్పడంతో ఎస్కార్ట్ కానిస్టేబుల్ నిందితుడి కాలుకు సంకెళ్ళు వేసి తీసుకొని టాయిలెట్‌లోకి వెళ్లిన నిందితుడు బయట వేసి చూస్తున్న ఎస్కార్ట్ కానిస్టేబుల్ కళ్ళుకప్పి పోలీస్ స్టేషన్ ప్రహారి గోడపై నుండి దూకి సంకెళ్ళతో సహా పారిపోయాడు.

Comments

comments