Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

మావోయిస్టుల ప్రాబల్య ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలు

Police-Checks-inఆసిఫాబాద్: రేపు తెలంగాణ బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చిన సందర్భంగా జిల్లా ఎస్పీ సన్‌ప్రిత్‌సింగ్ జిల్లాపోలీసు అధికారులతో నేడు ఉదయం టెలి కానణరెన్స్ నిర్వహించి  జిల్లాలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండ పోలీ సులు అలర్ట్‌గా ఉండాలి ఆదేశించారు.  ఎస్పీ ఆదేశాలతో జిల్లాలో పలు ప్రాంతాలలో బాంబ్‌స్కాడ్‌తో బస్ స్టాండ్ రైల్వేస్టేషన్‌లలో మరియు అనుమానిత ప్రదేశాలలో కల్వర్ట్‌లను తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతాలలో నిఘాపెంచమని సానుభూతి పరులను ముందుస్తుగా విచారిస్తున్నా మని, మావోయిస్టులు ఒక ప్రైవేటు బస్సును కాల్చి వేశారని,దానిని దృష్టిలో ఉంచుకుని జిల్లా లో ఎటువంటి  అవాంచనీయ సంఘటనలు జరగకుండా అన్ని విధాలుగా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ప్రాణహిత పరివాహక ప్రాంతాలతో ముందస్తు తనిఖీలు నిర్వహిస్తున్నామని ప్రజ లు కూడా పోలీసులకు సహాకరించాలని ఆయన కోరారు. మావోయి స్టు లు జనజీవన స్రవంతిలో కలవాలని పోలీసులు వారికి అన్ని విధాలుగా ఆదుకుంటారని, మారుమూల ప్రాంతాలలో పోలీసులు ప్రజలతో మమే కమై అనేక కార్యక్రమాలు చేస్తున్నామని ఆయన చెప్పారు.

Comments

comments