Home మల్కాజ్‌గిరి (మేడ్చల్) మత్తుదించిన ఖాకీలు

మత్తుదించిన ఖాకీలు

డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 1,593
మంది మందుబాబులు ప్రశాంతంగా వేడుకలు

Drunk

మన తెలంగాణ/సిటీబ్యూరో : నగర పోలీసులు రోడ్డు ప్రమాదాల రహితంగా 2017 న్యూ ఇయర్‌కు స్వాగతం పలికారు. అయితే డ్రంకన్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేయడం వల్లనే హైదరా బాద్, సైబరాబాద్, రాచకొండలలో ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగలేదని పోలీసులు ఆనందం వ్యక్తం చేశారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఈ మూడు పోలీసు కమిషరేట్ల పరిధిలో 145 ప్రాంతాలలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా 1593 మంది మందు బాబులు పట్టుబడ్డారు. వీరిపై కేసులు నమోదు చేసిన పోలీసులు వారి వాహనాలను సైతం సీజ్ చేశారు. పట్టుబడిన వారిలో ఒక మహిళ కూడా ఉండటం గమనార్హం.న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకుని శనివారం రాత్రి 6 గంటల నుంచే మూడు కమిషనరేట్ల పరిధిలో 15 వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. దీంతో పాటు 145 ప్రాంతాలలో ప్రత్యేకంగా డ్రంకన్‌డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారు జాము 5 గంటల వరకు కొనసాగిన ఈ తనిఖీలలో హైదారబాద్‌లో అత్యధికంగా 957 మంది వీరిలో ఒక మహిళ కూడా ఉన్నారు. సైబరాబాద్‌లో 399 మంది, రాచకొండలో 237 మంది మందుబాబులు పట్టుబడ్డారు. వీరంతా న్యూ ఇయర్ వేడుకల్లో తప్పతాగి వాహనాలను డ్రైవింగ్ చేస్తుండగా పట్టుకున్నారు. డ్రంకన్ డ్రైవ్ తనిఖీలపై ఏ మాత్రం పోలీసులు నిర్లక్షం వహించినా పెద్ద సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరిగి ఉండేవి. మొత్తం మీద న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంత వాతావరణంలో ముగియడంలో పోలీసుల సఫలికృతులయ్యారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలుగాని, రోడ్డు ప్రమాదాలు గాని జరగలేదు. న్యూ ఇయర్ వేడుకలను విజయవంతంగా ముగియడంతో పోలీసు సిబ్బందిని కమిషనర్లు మహేందర్‌రెడ్డి, సందీప్‌శాండిల్యా, మహేష్ భగవత్‌లు అభినందించారు.