Home పెద్దపల్లి గ్రామాల్లో… పోలీసుల శ్రమదానం

గ్రామాల్లో… పోలీసుల శ్రమదానం

Police

పాలకుర్తి: మండల పరిధిలోని పలు గ్రామాలలో గురువారం బసంత్‌నగర్ పోలీసులు శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసాలతక్కల్లపల్లి, రంగాపూర్, బ్రాహ్మణపల్లి, అప్పన్నపేట, కొత్తపల్లి, సబ్బితం, కుక్కలగూడూర్, జయ్యారం గ్రామాలలో ఈ కార్యక్రమాలను నిర్వహించారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ గ్రామాలలో నేరాలను నియంత్రించేందుకు సిసి కెమెరాల ఏర్పాటు చేస్తూనే పల్లెల్లో జనమైత్రి సమావేశాలను నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రజానీకానికి మరింత చేరువగా ఉండేందుకు గాను ఇటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జనమైత్రి పోలీసులతో పాటు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, యువకులు పాల్గొన్నారు.